Mahesh Babu: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ బాబు బావ గల్లా జయదేవ్!

  • ఎంపీలుగా ఉండి వ్యాపారాలు చేస్తున్నారన్న పవన్
  • పోలవరాన్ని పక్కన బెట్టారని విమర్శలు
  • తాము చేయాల్సిందంతా చేశామన్న గల్లా జయదేవ్
  • చేతులు కట్టేసి పోరాడమంటే ఎలాగని ప్రశ్న

కొందరు ఎంపీలు ఓ వైపు పదవిని అనుభవిస్తూనే మరోవైపు వ్యాపారాలు చేసుకుంటున్నారని, పోలవరంతో పాటు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హీరో మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ స్పందించారు. తన సోదరి డాక్టర్ రమాదేవితో కలసి ఏబీఎన్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయదేవ్ చెబుతూ, కొంతమంది వ్యాపారం చేసి ప్రజా ప్రతినిధులు అవుతుంటారని, మరికొందరు ప్రజా ప్రతినిధులుగా మారిన తరువాత వ్యాపారాలు చేస్తుంటారని, రెండింటికీ తేడా లేదని అన్నారు. తాము పార్లమెంట్ లో వెల్‌ లోకి వెళ్లామని, నినాదాలు చేశామని, ప్లకార్డులు చూపామని గుర్తు చేసిన ఆయన, తమను వదిలేస్తే పోరాడతామని, చేతులు కట్టేసి పోరాటం చేయమంటే ఎలా చేయగలమని వ్యాఖ్యానించారు.
 
ఎంపీగా జయదేవ్ ప్రజలకు అందుబాటులో ఉండడని వస్తున్న విమర్శలపైనా స్పందిస్తూ, అవన్నీ అసంతృప్తులు చేస్తున్న ప్రచారమేనని, ఈ సమస్యను ఎలా అధిగమించాలో తనకు తెలుసునని అన్నారు. 2019 ఎన్నికల్లో విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు తనకు పోటీగా దిగుతాడని భావిస్తున్నానని, గెలుపుకోసం శాయశక్తులా పోరాడతానని చెప్పారు. 2012 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన చిరంజీవి, రాజ్యసభకు వెళ్లిన తరువాత కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి తాను విఫలమయ్యానని, ఆపై సరైన పార్టీలో సరైన చోటు నుంచి స్థానాన్ని కోరుకుని తెలుగుదేశంలో చేరానని గల్లా జయదేవ్ తెలిపారు.

  • Loading...

More Telugu News