Arjun Reddy: విజయ్ దేవరకొండకు నచ్చేసిన ఆ వరంగల్ అమ్మాయి ఎవరో?

  • షోరూమ్ ప్రారంభోత్సవానికి వరంగల్ వచ్చిన విజయ్
  • ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా
  • స్పష్టం చేసిన 'అర్జున్ రెడ్డి' హీరో
  • కేరింతలు కొట్టిన అభిమానులు

సూపర్ హిట్ సినిమా 'అర్జున్ రెడ్డి'తో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. హన్మకొండలో ఓ షోరూమును ప్రారంభించేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, తాను పెళ్లి చేసుకునేది వరంగల్ కు చెందిన అమ్మాయినేనని స్పష్టం చేశాడు. తనకు పెళ్లంటూ జరిగితే అది ఇక్కడి అమ్మాయితోనేనని విజయ్ చెప్పిన మాటలను విని అభిమానులు కేరింతలు కొట్టారు.

తనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిన వారితో సరదాగా గడిపిన విజయ్, కాసేపు సినిమా డైలాగులు చెప్పి వారిని అలరించాడు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మేయర్ లు కూడా పాల్గొన్నారు. ఇక విజయ్ మనసులో ఎవరైనా వరంగల్ అమ్మాయి ఉందా? ఉంటే ఆమె ఎవరు? అన్న ప్రశ్నలు మాత్రం అభిమానుల్లో మిగిలాయి.

Arjun Reddy
Vijay Devarakonda
Warangal
  • Loading...

More Telugu News