bihar: బీహార్ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. సురక్షితంగా తప్పించుకున్న నితీశ్!
- బీహార్ బక్సర్ జిల్లాలోని నందన్ ప్రాంతంలో ఘటన
- భద్రతా సిబ్బందికి గాయాలు
- నా నిబద్ధత నచ్చని వారు ఇలా దాడులు చేస్తున్నారు-నితీశ్ కుమార్
- నేను మారుమూల గ్రామాల్లోనూ పర్యటిస్తాను..
బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడం కలకలం రేపింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. బీహార్ బక్సర్ జిల్లాలోని నందన్ ప్రాంతంలో ఆయన పర్యటిస్తోన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు.
తనపై చేసిన ఈ దాడి ప్రయత్నంపై నితీశ్ కుమార్ మాట్లాడుతూ... బీహార్ అభివృద్ధి విషయంలో తన నిబద్ధత నచ్చని వారు ఇలా దాడులు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ దాడి ఎవరి పనో తనకు తెలియదని చెప్పారు. తాను రాష్ట్ర రాజధానిలో కూర్చొని ప్రజలను పాలించబోనని, మారుమూల గ్రామాల్లోనూ పర్యటించి అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తానని, తనను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.