madarsa: మదర్సాల్లో సంస్కృత పాఠాలకు చోటు... ఉత్తరాఖండ్ లో ప్రతిపాదన!
- ఆప్షనల్ సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టే యోచన
- బోర్డు అంగీకారం తెలపాలి
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మదర్సాల్లో సంస్కృతాన్ని ఓ పాఠ్యాంశంగా బోధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన అక్కడి మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు ముందుకు వచ్చింది. అక్కడి మదర్సాల్లో ప్రస్తుతం సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఆయుష్ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఉండగా, సంస్కృతం, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులను కూడా ఆప్షనల్స్ జాబితాలో చేర్చాలన్నది ప్రతిపాదన. దీనికి అక్కడి మదర్సా బోర్డు అంగీకారం తెలిపితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంస్కృతాన్ని విద్యార్థులకు బోధించనున్నారు.