kerala: అవినీతికి పాల్పడ్డ కేసులో నాలుగు వారాల్లో స్పందించాలి.. కేరళ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు

  • 1995లో సంకీర్ణ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పినరయి విజయన్ 
  • విద్యుత్ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనుల్లో అవినీతి
  • కెనడా కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు

గతంలో జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు చేపట్టినప్పుడు ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆయనను నిర్దోషిగా తేలుస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చి ఆయనకు ఊరటనిచ్చింది. కాగా, ఈ కేసులో సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేయగా పినరయితోపాటు మరో ఇద్దరు నిందితులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశించింది. 1995లో సంకీర్ణ ప్రభుత్వంలో పినరయి విజయన్ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. కెనడా కంపెనీ ఎస్ఎన్‌సీ-లావలీన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

kerala
pinarai vijayan
corruption
  • Loading...

More Telugu News