kota shankar rao: సినిమాల్లో నేను సక్సెస్ కాకపోవడానికి కారణం అదే: కోట శంకర్ రావు

  • బ్యాంక్ లో ఉద్యోగం చేసేవాడిని 
  • అందువలన అవకాశాల కోసం తిరగలేదు 
  • నటన కోసం ఉద్యోగం వదులు కోలేదు  

కోట శంకర్ రావుకి స్టేజ్ ఆర్టిస్ట్ గా మంచి అనుభవం వుంది. రేడియోలోను .. టీవీ సీరియల్స్ లోను .. సినిమాల్లోను నటుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలను పొందకపోవడానికి కారణమేమిటనే ప్రశ్న ఆయనకి తెలుగు పాప్యులర్ టీవీ ఇంటర్వ్యూలో ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ .. " నేను బ్యాంక్ లో ఆఫీసర్ గా చేసేవాడిని. అందువలన సినిమావాళ్లను కలిసి అవకాశాలను అడిగే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ ఎవరైనా అవకాశం ఇస్తామన్నా ఒక్కోసారి చేయడానికి వీలుపడేది కాదు. ఉద్యోగం వుంది కాబట్టి హాయిగా నడిచిపోయేది. అలాంటప్పుడు ఉద్యోగం మానేసి పూర్తిగా నటన వైపుకే వెళ్లడానికి భయమేసింది. సినిమా ఫీల్డ్ సక్సెస్ మీద .. అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందువలన ఉద్యోగం మానేయడానికి నేను ధైర్యం చేయలేదు. సినిమాల సంఖ్య .. సక్సెస్ రేటు తక్కువగా ఉండటానికి అదే కారణం" అని చెప్పుకొచ్చారు.      

kota shankar rao
  • Loading...

More Telugu News