Pawan Kalyan: పవన్ ‘అజ్ఞాతవాసి’ని చూసి రాంగోపాల్ వర్మ భయపడ్డాడట!

  • ‘అజ్ఞాతవాసి’పై వర్మ ట్వీట్
  • పవన్ కెరియర్‌లోనే అత్యంత డిజాస్టర్ అన్న వర్మ
  • జంపింగ్ చేయాల్సిన పులి పాకడం ఆశ్చర్యపరిచిందట

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ని చూసి తాను భయపడినట్టు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఆర్జీవీ ట్విట్టర్‌లో స్పందిస్తూ పవన్‌పై సెటైర్లు వేశాడు.

 పవన్ కెరీర్‌లోనే అత్యంత చెత్త  సినిమా అయిన ‘పులి’ని చూసినట్టు ఉందని పేర్కొన్నాడు. కోరలు, పంజా లేని ఇలాంటి పులిని ఇప్పటి వరకు చూడలేదని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. చారలు లేని పులిని  తాను ఇప్పటి వరకు చూడలేదన్న వర్మ, దుమకాల్సిన పులి పాకడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీటాడు. 

Pawan Kalyan
Ramgopal varma
Agnathavasi
  • Loading...

More Telugu News