vh: అందుకే, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మంచిగా ఉండాల‌ని కేసీఆర్‌ చూస్తున్నారు!: వీహెచ్

  • ప‌వ‌న్ క‌ల్యాణ్ తో కేసీఆర్ సానుకూలంగా ఉండాలనుకుంటున్నారు
  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి కేసీఆర్ గాలం వేస్తున్నారు
  • తెలంగాణ‌లోనూ కాపులు ఉన్నారు

గ‌తంలో సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి మాట్లాడ‌మంటే ఎవ‌డా ప‌వ‌న్ క‌ల్యాణ్? అని కేసీఆర్ అన్నారని, అదే వ్య‌క్తితో కేసీఆర్ మొన్న భేటీ అయ్యార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు. ఈ రోజు ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ప‌వ‌న్ క‌ల్యాణ్ తో కేసీఆర్ సానుకూలంగా మెలిగే అవ‌కాశం ఉంద‌ని తాను ముందునుంచే అనుకుంటున్నాన‌ని తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి కేసీఆర్ గాలం వేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎందుకంటే, ప‌వ‌న్ ఓ సినీ న‌టుడని, ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉందని, అంతేకాకుండా ఆయ‌నో కాపు అని అన్నారు. తెలంగాణ‌లోనూ కాపులు ఉన్నారని ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మంచిగా ఉంటే వారి ఓట్లు టీఆర్ఎస్‌కి ప‌డ‌తాయ‌ని వీహెచ్‌ అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే ప‌రిమితం అవుతారా? తెలంగాణ‌లోనూ టీఆర్ఎస్ పార్టీని విమ‌ర్శిస్తారా? అన్న అనుమానం కేసీఆర్‌కి ఉండొచ్చని, అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మంచిగా ఉండాల‌ని కేసీఆర్‌ చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News