suicide: మోసం చేసిన యువకుడు.. తల్లీసోదరితో పాటు యువతి ఆత్మహత్య

  • వేరొక అమ్మాయితో యువకుడికి పెళ్లి నిశ్చయం 
  • మనస్తాపం చెందిన యువతి కుటుంబ సభ్యులు
  • త‌మిళ‌నాడులోని తిరునల్వేలిలో ఘటన

త‌మిళ‌నాడులోని తిరునల్వేలిలోని వాసుదేవనల్లూరు సమీపంలోని శంకుపురంలో విషాద‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సోర్న (26) అనే ఓ యువతి ఓ యువకుడితో కొంత కాలగా ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సార్న తల్లీచెల్లికి కూడా తెలుసు. అయితే, ఆమె ప్రేమిస్తోన్న యువకుడి తల్లిదండ్రులు వేరొక అమ్మాయితో అతనికి పెళ్లి నిశ్చయం చేశారు. ఈ విషయం సోర్న కుటుంబ సభ్యులకు తెలియడంతో మనస్తాపం చెంది సార్నతో పాటు ఆమె తల్లి, చెల్లి  విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  

  • Loading...

More Telugu News