nani: మల్టీ స్టారర్ మూవీలో నాని సరసన రకుల్!

  • మల్టీ స్టారర్ లో నాగ్ - నాని
  • డాన్ గా నాగ్ .. డాక్టర్ గా నాని 
  • దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య 
  • కథానాయికగా రకుల్  

క్రితం ఏడాది హ్యాట్రిక్ హిట్ అందుకున్న నాని, ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్ధం' చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. 'భలే మంచిరోజు' .. 'శమంతకమణి' సినిమాలను రూపొందించిన ఆయన, నాగ్ - నాని కాంబినేషన్లో మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. వరుస హిట్స్ తో నాని జోరు మీద ఉండటంతో, ఆయనతో కలిసి నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ క్రమంలోనే నానితో చేయడానికి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో డాన్ గా నాగ్ .. డాక్టర్ గా నాని కనిపించనున్న సంగతి తెలిసిందే.                    

  • Loading...

More Telugu News