sudha: 'గ్యాంగ్ లీడర్'లో సుమలత పాత్ర నేను చేయవలసింది: నటి సుధ

  • సుమలత పాత్ర కోసం నన్ను అడిగారు
  • విడో పాత్రలో కో డైరెక్టర్ నన్ను చూశారు 
  • ఆయన డైరెక్టర్ కి చెప్పడంతో ప్లాన్ మారిపోయింది         

తెలుగు తెరపై అక్క .. వదిన పాత్రలకు పెట్టింది పేరు సుధ. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఆమె, సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో తన కెరియర్ కి సంబంధించిన కొన్ని విశేషాలను గురించి మాట్లాడుతూ, 'గ్యాంగ్ లీడర్' గురించి ప్రస్తావించారు.

" నిజం చెప్పాలంటే ఈ సినిమాలో 'సుమలత' పాత్ర కోసం నన్ను అడిగారు. మరుసటి రోజున కన్ఫర్మ్ చేసి చెబుతామని కో డైరెక్టర్ వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజున నేను ఓ తమిళ సినిమాలో 'విడో' పాత్రలో నటిస్తున్నాను. ఆ షూటింగులో నన్ను చూసిన 'గ్యాంగ్ లీడర్' కో డైరెక్టర్ .. వెంటనే డైరెక్టర్ కి ఫోన్ చేసి, తమ సినిమాలోని 'విడో' పాత్రకే నేను బాగా సెట్ అవుతానని చెప్పాడట. అలా నాకు 'గ్యాంగ్ లీడర్' లో విడో పాత్ర దక్కింది. ఈ సంగతంతా నాకు తరువాత తెలిసింది. నిజం చెప్పాలంటే విడో పాత్ర చేయడమే నా కెరియర్ కి మంచిదైందని చెప్పాలి" అన్నారు.    

  • Loading...

More Telugu News