balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ లో 'బాల ఎన్టీఆర్'గా కల్యాణ్ రామ్ తనయుడు!

  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు 
  • మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • ఈ నెల 18వ తేదీన టీజర్ రిలీజ్

తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బాల్యం .. విద్యాభ్యాసం .. సినిమాల్లోకి ఎంట్రీ .. అగ్ర కథానాయకుడు కావడం .. రాజకీయాల్లోకి రావడం వరకూ ఈ బయోపిక్ లో చూపిస్తారట.

ఈ నేపథ్యంలో చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్ర కోసం కల్యాణ్ రామ్ తనయుడు 'శౌర్య'ను ఎంపిక చేసినట్టు సమాచారం. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాకి, బుర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను షూట్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జనవరి 18వ తేదీన ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. 

  • Loading...

More Telugu News