Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో ‘అజ్ఞాతవాసి’ ఫీవర్.. ఊగిపోతున్న పవన్ అభిమానులు!

  • అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద సందడి
  • థియేటర్లకు పోటెత్తుతున్న పవన్ అభిమానులు
  • ఏపీలో 7, తెలంగాణలో ఐదు షోలకు అనుమతి

తెలుగు రాష్ట్రాల్లో ‘అజ్ఞాతవాసి’ ఫీవర్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి థియేటర్ల వద్ద పవన్ అభిమానుల కోలాహలం మొదలైంది. తెలంగాణలో ప్రీమియర్ షోలకు అనుమతి లేకున్నా నేటి నుంచి ఈనెల 17 వరకు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 8 గంటల నుంచే సినిమా వేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఏడు షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పవన్ అభిమానులు తొలుత కొంత  నిరాశ చెందారు. అయితే అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో సంబరాల్లో మునిగిపోయారు.

ప్రీమియర్ షోలు వేస్తే తొక్కిసలాట జరుగుతుందని, నియంత్రణ కష్టమవుతుందని హైదరాబాద్‌ పోలీసులు చేతులెత్తేశారు. ఈ కారణంగా వాటికి అనుమతి ఇవ్వలేదు. మరోవైపు, రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి లభించడంతో నిర్మాత హర్షం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడంతో పవన్ అభిమానుల హంగామా చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే షోలు మొదలు కావడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది.

Pawan Kalyan
Agnathavasi
Andhra Pradesh
Telangana
  • Error fetching data: Network response was not ok

More Telugu News