Pregnant woman: మూడో అంత‌స్తు ఎక్కి.. కిటికీ ప‌గుల‌కొట్టి గ‌ర్భిణిని కాపాడిన వ్య‌క్తి.. మీరూ చూడండి!

  • మూడో అంత‌స్తులో మంటల్లో చిక్కుకుపోయిన గర్భిణి
  • అపార్ట్ మెంట్‌ వెనక వైపు నుంచి ఎక్కిన వ్యక్తి
  • రెస్క్యూ సిబ్బంది సాయంతో కిందకు దిగిన మహిళ

మూడో అంత‌స్తులో మంటల్లో చిక్కుకుపోతోన్న ఓ గర్భిణిని ఓ వ్యక్తి కాపాడిన ఘటన చైనాలోని హెనాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. గమనించిన అపార్ట్ మెంటులోని వారంతా కిందకు వచ్చేవారు. కానీ, ఓ ఫ్లాట్‌లో ఓ గర్భిణి మాత్రం రాలేకపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అపార్ట్ మెంటు వెనక వైపు నుంచి మూడో అంతస్తు వరకు ఎక్కి కిటికీ పగులకొట్టి అందులోంచి ఆ మహిళను బయటకు వచ్చేలా చేసి కిందికి దించాడు. అతడికి రెస్క్యూ సిబ్బంది కింది నుంచి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్కడి పోలీసులు విడుదల చేశారు. 

  • Loading...

More Telugu News