sandra venkata veeraiah: ధర్నాకు దిగిన టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర!

  • సంగారెడ్డి చెరువును కాపాడాలంటూ ధర్నా
  • ఆక్రమణలను అడ్డుకోండి
  • లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధర్నాకు దిగారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో గల సంగారెడ్డి చెరువు ఆక్రమణలకు గురవుతోందంటూ ధర్నా చేపట్టారు. ఆక్రమణదారుల నుంచి చెరువును కాపాడాలంటూ ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. చెరువు ఆక్రమణకు గురవుతున్న విషయం కళ్ల ముందు కనపడుతున్నా, అధికారులు కిమ్మనకుండా ఉంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆక్రమణలను అడ్డుకోవాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సండ్ర ధర్నా సందర్భంగా అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

sandra venkata veeraiah
tTelugudesam
  • Loading...

More Telugu News