prabhas: 'సాహో' దుబాయ్ షెడ్యూల్ వాయిదా.. రేపటి నుంచి హైదరాబాద్ లో!

  • 'సాహో' దుబాయ్ షెడ్యూల్ వాయిదా 
  • ముందుకు జరిపిన హైదరాబాద్ షెడ్యూల్ 
  • తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో చిత్రీకరణ

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ 'సాహో' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంతో కసరత్తు చేశాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా దగ్గర జరగవలసి వుంది. అయితే అందుకు సంబంధించిన అనుమతులు రాకపోవడంతో, ఆలస్యం అవుతూ వస్తోంది.

 ఈ షెడ్యూల్ తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. అయితే 'దుబాయ్' షెడ్యూల్ ఆలస్యం అవుతూ ఉండటంతో, ముందుగా హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. రేపటి నుంచి హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ ను మొదలుపెడుతున్నారు. ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ తో పాటు, ముఖ్య తారాగణమంతా ఈ షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించనున్నారు.

  • Loading...

More Telugu News