Nagarjuna: గచ్చిబౌలిలో నాగ్ .. వర్మ సినిమా షూటింగ్!

  • వర్మతో నాగ్ తాజా చిత్రం 
  • పోలీస్ ఆఫీసర్ గా నాగ్ 
  • సిక్స్ ప్యాక్ కోసం నాగ్ కసరత్తు   

నాగార్జున .. రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేశారు. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ హైదరాబాద్ - గచ్చిబౌలిలో జరుగుతోంది. నాగ్ తో పాటు ఇతర ముఖ్య పాత్రధారులు షూటింగులో పాల్గొంటున్నట్టుగా సమాచారం. పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున చేస్తుండటం ఒక విశేషమైతే, ఆయన సిక్స్ ప్యాక్ లో కనిపించనుండటం మరో విశేషం.

 మైరా సరీన్ ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. గతంలో నాగ్ .. వర్మ కాంబినేషన్లో వచ్చిన 'శివ' ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి 'అంతం' .. 'గోవిందా గోవిందా' చేసినా, అవి ఆశించిన స్థాయిలో అభిమానులను అలరించలేకపోయాయి. తాజా చిత్రం మాత్రం 'శివ'ను మించి వుంటుందని వర్మ చెబుతుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది.        

  • Loading...

More Telugu News