indigo: రూ.899కే విమాన ప్రయాణం... ఇండిగో ఆఫర్!

  • ఈ నెల 10 వరకు అమల్లో
  • ఫిబ్రవరి 1- ఏప్రిల్ 15 మధ్య ప్రయాణాలకు
  • హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డుల చెల్లింపులపై 10 శాతం తగ్గింపు

బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కేవలం రూ.899కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. న్యూఇయర్ ఆఫర్ కింద నేటి నుంచి ఈ నెల 10 వరకు మూడు రోజుల్లోపు ఈ రేట్లకు టికెట్లను సొంతం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణానికి టికెట్లను తీసుకోవచ్చు. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసే వారు టికెట్ల ధరపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ (గరిష్టంగా రూ.600 వరకే) పొందొచ్చు. అలాగే ఇండిగో స్పెషల్ సర్వీస్ ఓచర్స్ ను కూడా రూ.600 విలువ వరకు పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్లను www.goindigo.in పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే వారికి మాత్రమే పరిమితం.

indigo
discount
airlines
  • Loading...

More Telugu News