mobile shopping: యాప్ తో ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా...? మీరు తెలుసుకోవాల్సిన అంశాలివే...!
- చూసేవారే ఎక్కువ
- చివరికి కొనేది 27 శాతమే
- ఓ అధ్యయనంలో వెల్లడైన అంశాలు
స్మార్ట్ ఫోన్లు, డేటా చౌక ధరలకే వస్తుండడంతో... స్మార్ట్ ఫోన్ నుంచే ఆన్ లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2016 సంవత్సరపు గణాంకాలను ఆధారంగా నిర్వహించిన ఓ అధ్యయనం వివరాలు ఇవి.
- మొబైల్ యాప్స్ ద్వారా చూసే వారే ఎక్కువ. కొనేవారు తక్కువే. కార్ట్ కు యాడ్ చేసి ఆ లావాదేవీని ముగించకుండా విడిచిపెట్టే కస్టమర్లు ఎక్కువగానే ఉంటున్నారు. 2016లో కార్డ్ కు యాడ్ చేసిన వాటిలో 27 శాతమే లావాదేవీలు పూర్తయ్యాయి.
- మొబైల్ యాప్ లో ప్రొడక్ట్, దాని కింద ఉన్న సమాచారాన్ని స్క్రీన్ సైజు తక్కువగా ఉండడం వల్ల పూర్తిగా చూడలేకపోతున్నారు. దీంతో ప్రత్యేక ఆఫర్లు, పైకి వెల్లడించని చార్జీల సమాచారం తెలియడం లేదు. దీంతో లావాదేవీలు ముగించకపోవడానికి ఇది కూడా ఒక కారణమే.
- మరి మొబైల్ షాపింగ్ పై ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు, లావాదేవీలు సక్సెస్ కాకపోవడం అన్నది సవాలేనని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఈ వివరాలను జర్నల్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ ప్రచురించింది.