Imran Khan: పెళ్లి చేసుకుందామని అడిగానంతే... ఇంకా చేసుకోలేదు: ఇమ్రాన్ ఖాన్

  • ఇమ్రాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు
  • ఖండించిన మాజీ క్రికెటర్
  • కేవలం ప్రతిపాదించానంతేనని వివరణ

తాను రహస్యంగా మూడో వివాహం చేసుకున్నట్టు వచ్చిన వార్తలపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రతిపక్ష తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. తానింకా పెళ్లి చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇస్లాం మత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే బుష్రా మేనక్ (44)ను తాను ఇష్టపడ్డానని, ఆమె ముందు పెళ్లి ప్రతిపాదనను ఉంచానని చెప్పుకొచ్చారు. అయితే, పెళ్లి ఇప్పుడే వద్దని, కొంత సమయం కావాలని ఆమె కోరిందని, ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేందుకు తనకు అభ్యంతరం లేదని అన్నారు. తన పెళ్లి ప్రస్తుతానికి ప్రతిపాదనల వద్దే ఉందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

Imran Khan
Third Marriage
Bushra Menak
  • Loading...

More Telugu News