Catherine Tresa: అలాంటి పాత్రలు చేసేంత వయసు నాకింకా రాలేదు!: హీరోయిన్ క్యాథరిన్ ట్రెసా

  • టాప్ హీరోతో జతకట్టినా సరైన బ్రేక్ సాధించలేకపోయిన భామ
  • గ్లామర్ పాత్రలకు సిద్ధమంటున్న క్యాథరిన్ ట్రెసా
  • నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తుందట!

టాలీవుడ్ లో అల్లు అర్జున్ వంటి టాప్ హీరోతో జతకట్టినా సరైన బ్రేక్ సాధించలేక, అటు తమిళంలోనూ అవకాశాలను పట్టుకోలేకపోయిన నటి క్యాథరిన్‌ ట్రెసా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న వేళ, మీడియాతో మాట్లాడుతూ, గ్లామరస్ గా నటించడానికి తాను సిద్ధమని చెప్పింది. హీరోలకు అక్కగానో, చెల్లిగానో నటించేమంటే మాత్రం తన వల్ల కాదని, క్యారెక్టర్ పాత్రలు చేసేంత వయసు తనకింకా రాలేదని చెప్పుకొచ్చింది.

ఇక పెళ్లెప్పుడన్న ప్రశ్నకు, తనకు సరైనోడు ఇంకా దొరకలేదని, అన్ని విధాలుగా తనకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని వెల్లడించింది. ప్రస్తుతం 'కలగలప్పు-2', 'కథానాయగన్‌' చిత్రాల్లో నటిస్తున్న ఈ సుందరి, 'కలగలప్పు-2'లో తన అందాలను ఆరబోసిందన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

Catherine Tresa
Allu Arjun
Tollywood
  • Loading...

More Telugu News