Narendra Modi: భారత్ - పాక్ మిత్రులు కావాలి : సీఎం మెహబూబా ముఫ్తీ ఆకాంక్ష
- జమ్మూ కాశ్మీర్ ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలి
- సరిహద్దుల్లో మన జవాన్లను కాపాడుకుందాం
- ఇరుదేశాలు చర్చలు జరపాలి
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల సుఖ సంతోషాల కోసం, సరిహద్దుల్లో మన జవాన్లను కాపాడుకునేందుకు వైరం మరిచి మిత్రులు కావాలని, అందుకోసం, భారత్-పాక్ దేశాలు మిత్రులు కావాలని ఆమె కోరుకున్నారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి, పాక్ దేశానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరుదేశాలు చర్చలు జరిపి మిత్రులు కావాలని అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో ముఫ్తీ కోరారు. కాగా, బారాముల్లా జిల్లా సోపోర్ టౌన్ షిప్ లో ఐఈడీ పేలి నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయి, ఇద్దరు గాయపడ్డ సంఘటన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు.