medicine: ఉన్నత విద్య కోసం బ్రిటన్ కంటే చైనాకే ప్రాధాన్యమిస్తున్న భారతీయ విద్యార్థులు!

  • బ్రిటన్ లో 18,015 మంది, చైనాలో 18,171 మంది విద్యార్థులు
  • వ్యయం తక్కువ, ఇంగ్లిష్ బోధన
  • మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు చాయిస్

విదేశీ విద్య కోసం మన దేశంలో చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ విషయంలో మన వారికి ఏ దేశం మెరుగైన ఆప్షన్? అని పరిశీలించి చూస్తే అది కచ్చితంగా చైనాయే అని చెప్పొచ్చు. ఎందుకంటే, 2016లో బ్రిటన్ కంటే ఎక్కువ సంఖ్యలో భారత విద్యార్థులు చైనాకు వెళ్లారు. పొరుగునే ఉన్న చైనాలో వైద్య విద్య కోసం భారతీయ విద్యార్థులు ప్రయాణం కట్టడం 2010 నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ విదేశాల్లో వైద్య విద్యకు చైనాయే మనవారికి నంబర్ 1 ఆప్షన్ గా ఉండగా, తాజాగా ఇంజనీరింగ్ విద్యకూ చైనాను ఎంపిక చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

‘‘ఖర్చు పరంగా తక్కువ అవుతుంది. చైనా మెడికల్ డిగ్రీలకు భారత మెడికల్ కౌన్సిల్ గుర్తింపు ఉంది. ఈ కోర్సును ఇంగ్లిష్ లో కండక్ట్ చేస్తారు’’ అని విద్యా రంగ నిపుణులు ప్రతిభాజైన్ తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్ లో 18,015 మంది భారతీయులు చదువుతుంటే, చైనాలో 18,171 మంది చదువుతున్నారు. ‘‘నీట్ పూర్తి చేయలేని ఎందరికో చైనా సహజ ఎంపిక అవుతోంది. రష్యా అయితే భాషా పరమైన సమస్య ఉంది. చైనాలో వైద్య విద్యకు ఏటా 2,000-3,000 డాలర్ల వరకు ఖర్చవుతుంది. దీనికి అదనంగా 1,000 డాలర్లు నివాస ఖర్చులకు అవుతుంది’’ అని జైన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News