pil: మాజీ రాష్ట్రపతులు, ప్రధానులకు అధికారిక నివాసాల సౌకర్యంపై పిల్.. సుప్రీంకోర్టులో విచారణ!

  • సుప్రీంకోర్టు ముందుకు ఓ పిల్
  • ప్రముఖులకు అధికారిక నివాసాలు కేటాయించడాన్ని సవాలు
  • మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు ఎందరో అధికారిక నివాసాల్లో

దేశంలో అత్యంత ప్రముఖులైన వారు త్వరలో తాము నివసిస్తున్న అధికారిక భవనాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితులు వచ్చేట్టున్నాయి. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానులు హెచ్ డీ దేవెగౌడ, అటల్ బిహారీ వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ తదితరులు ప్రస్తుతం అధికారిక నివాసాలను అనుభవిస్తున్నవారే. దేశంలో అత్యున్నత పదవులను అలంకరించిన వారిగా వీరికి అధికారిక భవనాలను కేటాయించారు. అయితే, సుప్రీం కోర్టు ముందు ఈ విషయమై ఓ ప్రజాహిత వ్యాజ్యం (పిల్) విచారణకు వచ్చింది.

మాజీ ముఖ్యమంత్రులకు అధికారిక నివాసాల కేటాయింపును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేయడాన్ని సవాలు చేస్తూ లోక్ ప్రహరి అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది. దీంతో ఈ విషయంలో కోర్టు సహాయకుడిగా మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యంను సుప్రీంకోర్టు నియమించింది. ‘‘ఈ పిటిషన్ లో లేవనెత్తిన అంశం ప్రజా ప్రయోజనాల కోణంలో పలు ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఈ తరహా చట్టాలు, కేంద్ర చట్టం ఉంటే వాటిపైనా దీని ప్రభావం ఉండొచ్చు. దీంతో ఈ అంశంలో దాగున్న అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

  • Loading...

More Telugu News