Renu Desai: రేణూ దేశాయ్ పెళ్లి చేసుకుంటే, ఆమె భర్తను చంపేస్తామన్నా పట్టించుకోని పవన్: కత్తి మహేష్

  • రేణూపై సామాజిక దాడికి దిగిన అభిమానులు
  • అయినా స్పందించని పవన్ కల్యాణ్
  • పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు
  • మీడియాతో కత్తి మహేష్

పవన్ కల్యాణ్ అభిమానులు ఓ ముఖం లేని గుంపు వంటి వారని, వారు తనతో పాటు, ఆయన భార్య రేణూ దేశాయ్ పైనా సామాజిక దాడికి దిగారని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోపించారు. రేణూ దేశాయ్ తన రెండో వివాహం గురించి ఒక్క మాట ప్రస్తావిస్తే, పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారని, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేస్తామని హెచ్చరించారని గుర్తు చేసిన కత్తి, కనీసం ఆ వ్యాఖ్యలను సైతం పవన్ ఖండించలేదని, ఇక ఆయన ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించాడు.

 ప్రశ్నిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్, తన అభిమానులను ఎంతమాత్రమూ కంట్రోల్ చేయలేకపోతున్నారని అన్నాడు. తాను ఓ మామూలు మనిషినని, తనపై అభిమానులు చేస్తున్న విమర్శలను, దాడిని, ఒక్క మాట చెప్పి పవన్ అడ్డుకోలేక పోతున్నారని ఆరోపించాడు. తాను ఎన్నడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, వాటికి సమాధానం చెప్పలేని ఆయన, రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. తన ప్రాణాలకు అపాయం ఉందని, ఆ భయంతోనే ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తే, తనతో చర్చించేందుకు ఎవరూ రాలేదని ఆయన అన్నాడు. 

Renu Desai
Kathi Mahesh
Pawan Kalyan
  • Loading...

More Telugu News