Pawan Kalyan: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు పోలీసులు... గొడవ చేస్తే అరెస్ట్ చేస్తామని పవన్ ఫ్యాన్స్ కు హెచ్చరిక!

  • మరికాసేపట్లో మీడియా సమావేశం
  • భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు
  • గొడవకు దిగితే చర్యలుంటాయన్న అధికారులు

మరికాసేపట్లో సినీ విమర్శకుడు కత్తి మహేష్, హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా చూసుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి, కత్తి మహేష్ కు వ్యతిరేకంగా వ్యవహరించవచ్చన్న నిఘా అధికారుల సూచనలతోనే బందోబస్తుకు వచ్చినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న కొందరు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, క్లబ్ లో సమాలోచనలు సాగిస్తుండగా, వారిని వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. ఈ ప్రాంతంలో గొడవ చేస్తే అరెస్ట్ చేస్తామని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం దాదాపు 20 మందికి పైగా పోలీసులు క్లబ్ వద్దకు రాగా, అవసరమైతే మరింత మందిని పిలిపిస్తామని అధికారులు వెల్లడించారు.

Pawan Kalyan
Kathi Mahesh
Somajiguda
Press Club
  • Loading...

More Telugu News