Pawan Kalyan: అప్పుడే వచ్చేసిన ఓబీ వ్యాన్ లు, చేరుకుంటున్న పవన్ అభిమానులు... సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద సందడి!

  • మీడియాకు అందిన కత్తి మహేష్ ఆహ్వానం
  • చేరుకుంటున్న టెలివిజన్ మీడియా ప్రతినిధులు
  • భారీగా తరలివస్తున్న పవన్ ఫ్యాన్స్

పవన్ కల్యాణ్, పూనం కౌర్ లకు బహిరంగ సవాల్ విసురుతూ, ఈ ఉదయం 11 గంటలకు మీడియా మీట్ ను కత్తి మహేష్ ఏర్పాటు చేయగా, సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద అప్పుడే సందడి మొదలైంది. పలు తెలుగు వార్తా చానల్స్ కు చెందిన ఓబీ వ్యాన్ లు అక్కడికి చేరుకున్నాయి. పవన్ ఫ్యాన్స్ కూడా క్లబ్ వద్దకు వస్తుండటంతో పోలీసులు కూడా కొంతమంది వచ్చారు. తన సమావేశానికి రావాలని కత్తి మహేష్ నుంచి మీడియాకు ఆహ్వానాలు అందాయి.

ఇటీవలి కాలంలో తమ హీరోను కత్తి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో నేడు తేలుస్తామని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఓ గౌరవ ప్రదమైన పొజిషన్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను ఏబ్రాసి, ఏరా, రారా, జోకర్, బ్రోకర్, అరేయ్, పాపం కదరా... అంటూ కత్తి సంబోధిస్తుండటాన్ని తాము సహించలేకున్నామని ఇక్కడికి వచ్చిన పవన్ అభిమానులు ఆగ్రహంగా వ్యాఖ్యానిస్తున్నారు. 11 గంటల నుంచి ఒంటి గంట వరకూ స్లాట్ ను బ్లాక్ చేసుకున్న కత్తి మహేష్, ఎన్ని గంటలకు వస్తాడన్న విషయం తేలాల్సి వుంది. పూనం కౌర్ బండారాన్ని బట్టబయలు చేస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలపైనా ఆసక్తి నెలకొంది.

Pawan Kalyan
Kathi Mahesh
Somajiguda
Press Club
  • Loading...

More Telugu News