Ghajal Srinivas: చంద్రబాబు సర్కారు వేటు... గజల్ శ్రీనివాస్ కు మరో షాక్!

  • ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తొలగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • లైంగిక ఆరోపణల నేపథ్యంలో పదవికి అర్హుడు కాదన్న అధికారులు

తన వద్ద పనిచేస్తున్న యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ గజల్ శ్రీనివాస్ కు ఇప్పుడు షాక్ మీద షాక్ తగులుతోంది. ఆయనతో గతంలో అసోసియేట్ అయిన ప్రతి సాంస్కృతిక సంస్థా ఇప్పుడాయన్ను చీదరించుకుంటోంది. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వీడియోలు ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా, ఆంధ్రప్రదేశ్ సర్కారు సైతం షాకిచ్చింది. గజల్ శ్రీనివాస్ ను ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తొలగిస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. గజల్ శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణలు, కనిపిస్తున్న సాక్ష్యాల నేపథ్యంలో, ఈ పదవికి ఆయన అర్హుడు కాదన్న నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. గజల్ శ్రీనివాస్ ను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Ghajal Srinivas
Andhra Pradesh
Government
Swatcha Andhra
  • Loading...

More Telugu News