ntr film: 'బసవతారకం' పాత్ర కోసం టెక్నాలజీ వాడుతున్న డైరెక్టర్ తేజ

  • ఆడిషన్లకు భారీగా వస్తున్న మహిళలు
  • ఫేస్ రికగ్నిజన్ టెక్నాలజీని వాడుతున్న తేజ
  • బసవతారకం రూపానికి దగ్గరగా ఉండే మహిళ కోసం కసరత్తు

దివంగత నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలకృష్ణ నిర్మాతగా కూడా మారారు. ఎన్టీఆర్ పాత్రను బాలయ్యే పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం తేజ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆడిషన్ల కోసం చాలా మంది మహిళా ఆర్టిస్టులు వస్తున్నారట.

వీరిలో సరైన వ్యక్తిని ఎంపిక చేయడం కోసం తేజ టెక్నాలజీని వాడుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సాయంతో బసవతారకంకు ఎవరు సరిగ్గా సరిపోతారో పరిశీలిస్తున్నారట. ఆమె రూపానికి దగ్గరగా ఉండేవారిని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు.

ntr film
teja
Balakrishna
basavatarakam
  • Loading...

More Telugu News