Balakrishna: 'జై సింహా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్!

  • సెన్సార్ పూర్తి చేసుకున్న 'జై సింహా'
  • ఈ నెల 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • చిరంతన్ భట్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ    

బాలకృష్ణ తాజా చిత్రంగా రూపొందిన 'జై సింహా' ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ తేదీ కోసం బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఈ సినిమా టీజర్ కు .. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

టీజర్ చూసినవాళ్లు బాలకృష్ణ మరింత హ్యాండ్సమ్ గా ఉన్నాడనీ .. నయనతార మరింత గ్లామర్ గా కనిపిస్తోందని అంటున్నారు. అందుకు ఫుల్ ఖుషీ అవుతోన్న ఈ సినిమా టీమ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 8వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. బలమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందిందని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చెబుతుంటే, చిరంతన్ భట్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్మాత అంటున్నారు. 

  • Loading...

More Telugu News