Chandrababu: మార్చి 31 లోగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి : సీఎం చంద్రబాబు

  • ఇచ్ఛాపురంలో ‘జన్మభూమి-మాఊరు’లో పాల్గొన్న చంద్రబాబు
  • రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు పాటుపడతా
  • ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలి
  • పలు చోట్ల ‘చెంబు శవయాత్ర’ నిర్వహిస్తుండటం సంతోషం: బాబు

మార్చి 31 లోగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు పాటుపడతామని, ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని, ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘జన్మభూమి’లో భాగంగా ఈరోజు ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్’ అంశాన్ని తీసుకున్నామని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరమని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారని, గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.15 వేలు ఇస్తున్నామని అన్నారు.మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలనే దానిపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, పలు చోట్ల ‘చెంబు శవయాత్ర’ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆరు జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని, మరో ఏడు జిల్లాల్లో నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. వారంలో శనివారం పరిసరాల పరిశుభ్రత కోసం పనిచేయాలని ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News