mohan babu: 'ఎవరూ ఆపలేని వ్యక్తి'... తండ్రి పేరు కలిసొచ్చేలా కొడుకుకి పేరు పెట్టిన మంచు విష్ణు!

  • మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు
  • మంచు విష్ణు కుమారుడి పేరు ‘అవ్రామ్‌ భక్త’
  • అవ్రామ్‌ అంటే ఎవరూ ఆపలేని వ్యక్తి అని అర్థం

సినీనటుడు మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అన్న విషయం తెలిసిందే. తన తండ్రి పేరు కలిసొచ్చేలా మంచు విష్ణు తన కుమారుడికి ‘అవ్రామ్‌ భక్త’ అని పేరుపెట్టాడు. విష్ణు దంపతులకు అరియానా, వివియానా అనే కవల ఆడ పిల్లలు కూడా ఉన్నారు. ఈ రోజు విష్ణు ట్వీట్ చేస్తూ... తన కుమారుడిని అరియానా ‘బేబీ లయన్‌’ అని పిలుస్తోందని, వివియానా మాత్రం ‘బేబీ టెడ్డీ బేర్‌’ అని పిలుస్తోందని తెలిపారు. కానీ తాము మాత్రం వాడిని అవ్రామ్‌ భక్త అని పిలుస్తామని తెలిపాడు. అవ్రామ్‌ అంటే ఎవరూ ఆపలేని వ్యక్తి అని అర్థం చెప్పాడు. మంచు విష్ణు భార్య విరోనికా ఈ నెల1న మగబిడ్డకు జన్మనిచ్చింది. 

mohan babu
vishnu
son
  • Error fetching data: Network response was not ok

More Telugu News