Chandrababu: ఇదో వినూత్న కార్యక్రమం, 10 రోజుల నిరంతర ప్రక్రియ: సీఎం చంద్రబాబు

  • ప్రజా చైతన్యం మన సంస్కృతిలో ఒక భాగం కావాలి
  • ప్రజా చైతన్యంతోనే అద్భుత ఫలితాలు సాధ్యం
  • గ్రామసభలు అభివృద్ధి వేదికలే తప్ప రాజకీయ వేదికలు కాదు
  • ‘జన్మభూమి-మా ఊరు’ 3వ రోజు నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

‘ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి జన్మభూమి కన్నా మెరుగైన వేదికలేదు, ఇంతకన్నా మెరుగైన అవకాశం లేదు. ప్రజలను చైతన్యపరచడం చాలా కష్టం. కానీ, ఒకసారి అలవాటు అయితే చైతన్యం మన సంస్కృతిలో భాగం అవుతుంది. ప్రజా చైతన్యం మన సంస్కృతిలో ఒక భాగం కావాలి. ప్రజా చైతన్యంతోనే అద్భుత ఫలితాలు సాధ్యం’ అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం తన నివాసం నుంచి 3వ రోజు ‘జన్మభూమి-మా ఊరు’ నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... ‘ఇదో వినూత్న కార్యక్రమం, 10 రోజుల నిరంతర ప్రక్రియ, 16 వేల గ్రామాలు, వార్డులలో జరిగే అభివృద్ధి యజ్ఞం..అంకిత భావంతో, సేవా దృక్ఫథంతో జన్మభూమిలో అందరూ పాల్గొనాలి.. సమాజం పట్ల మనకున్న బాధ్యత నిర్వర్తించాలి’ అని అన్నారు
 
జన్మభూమి గ్రామసభలు అభివృద్ధి వేదికలే తప్ప రాజకీయ వేదికలు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రకరకాల వ్యక్తులు వేర్వేరు అజెండాలతో గ్రామసభలకు వస్తారని, ఎవరు ఏ ఉద్దేశాలతో గ్రామసభలకు వచ్చినా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, సంయమనం పాటించాలని సూచించారు. 1,89,171 రేషన్ కార్డులు కొత్తగా అందిస్తున్నామని, గతంలో ఆమోదం పొంది పంపిణీ చేయని మరో 57 వేల కార్డులు కూడా అందజేస్తున్నామని, మొత్తం 2.46లక్షల రేషన్ కార్డులు ఈ జన్మభూమిలో పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News