Ghajal Srinivas: మహిళలు, గర్భవతుల గురించి 'శ్రీరంగనీతులు' చెప్పిన గజల్ శ్రీనివాస్... వీడియో చూడండి!

  • లైంగిక వేధింపుల కేసులో బుక్కయిన శ్రీనివాస్
  • చాలా మంచివాడిగా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్
  • మహిళలను దేవతలుగా చూస్తానని సుద్దులు!

తన గజల్స్ తో పాప్యులర్ అయిన శ్రీనివాస్, నేడు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుని జైలు పాలైన సంగతి తెలిసిందే. తన ఆఫీసులో పని చేస్తున్న ఓ యువతిని నానా హింసలూ పెట్టిన గజల్ శ్రీనివాస్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు మరింతగా బిగిసిన వేళ, గతంలో గజల్ శ్రీనివాస్ మాట్లాడిన మాటల వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. మహిళలు, ముఖ్యంగా గర్భవతులపై తన అభిప్రాయాలను ఎంతో హృద్యంగా, అత్యంత మంచివాడిగా చెబుతున్నాడు గజల్ శ్రీనివాస్.

ఇతరుల క్యారెక్టరును తాను ఎన్నడూ తక్కువ చేసి చూడబోనని, తన డ్రైవర్ ను సైతం 'అండీ' అనే పిలుస్తుంటానని చెప్పాడు. ఇతరులకు సాయపడేవారంటే, తనకెంతో అభిమానమని, ఎవరైనా అంధులు, వృద్ధులను రోడ్డు దాటిస్తున్న వ్యక్తిని చూసినా సంతోషిస్తానని చెప్పాడు. తన కారు వెళుతుంటే, ఎవరైనా మహిళ అడ్డుగా వచ్చినట్టు చూస్తే వెంటనే కారు ఆపేస్తానని, గర్బవతిగా ఉన్న మహిళను దేవతలా పరిగణిస్తానని చెప్పాడు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

Ghajal Srinivas
Sexual Harrasment
  • Error fetching data: Network response was not ok

More Telugu News