Ghajal Srinivas: తెలిస్తే చంపేస్తారని తెలిసినా... గజల్ శ్రీనివాస్ కు మసాజ్ చేసింది అందుకే!: రేడియో జాకీ

  • గజల్ కు సన్నిహితంగా ఉన్న వీడియోపై స్పందించిన బాధితురాలు
  • కావాలనే అలా చేశానని వెల్లడి
  • అదే కీలక సాక్ష్యమైందన్న రేడియో జాకీ
  • తెలిస్తే తనను చంపేస్తారన్న భయం ఉన్నా ధైర్యం చేశానన్న బాధితురాలు

తాను స్వయంగా గజల్ శ్రీనివాస్ కు ఎందుకు నన్నిహితంగా ఉన్నట్టు వీడియోలో కనిపించానన్న విషయమై బాధితురాలు, రేడియో జాకీ స్పందించింది. ఓ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, "గజల్ శ్రీనివాస్ బెడ్ రూములో కెమెరాలు అమర్చానని తెలిస్తే నన్ను చంపేస్తారని నాకు తెలుసు. కానీ, నాలా ఇంకో అమ్మాయి కాకూడదనే ఆ పని చేశా. కొందరు నేను కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్నానని, ఆయనను ట్రాప్ చేశానని అంటున్నారు. సరైన సాక్ష్యాల కోసమే ఆ రోజు నేను బెడ్ రూములోకి వెళ్లాను. ఆయన కాళ్లు పడుతున్నట్టు కూర్చున్నాను.

ఈ స్టింగ్ ఆపరేషన్ చేయడానికి చాలా గ్రౌండ్ వర్క్ చేశా. అతని బెడ్ రూములో మంచం తప్ప మరేమీ ఉండదు. ధైర్యంగా సీక్రెట్ కెమెరాను పెట్టాను. ఒకవేళ నేను ఏ రోజైనా ఆఫీసు నుంచి రాకపోతే... ఆ రోజు నా ఆఫీసుకు వెళ్లి, ఫలానా చోట కెమెరాను పెట్టాను తీసుకోండని నా దగ్గరి స్నేహితురాలికి చెప్పా" అని వెల్లడించింది.

కావాలనే తాను గజల్ శ్రీనివాస్ కు మసాజ్ చేశానని, ఇదంతా కెమెరాలో రికార్డవుతుందని తనకు తెలుసునని ఆమె వెల్లడించింది. తొలుత పోలీసుల వద్దకు వెళ్లడానికి కూడా తాను భయపడ్డానని, అయితే, ఏసీపీ విజయ్ కుమార్, సీఐ రవీందర్ లు తనకు ధైర్యం చెప్పారని, తన సాహసానికి, ధైర్యానికి న్యాయం చేస్తామని చెబుతూ ఆయన్ను అరెస్ట్ చేశారని తెలిపింది. తాను ఇన్ని ఆధారాలు, వీడియోలతో ఫిర్యాదు చేసినా ఇంకా కొంతమంది తననే అనుమానంగా చూస్తున్నారని, ఇదే పరిస్థితి తమ ఇంట్లోని ఆడపిల్లకు ఎదురైతే ఏం చేయాలని వారు ఒకసారి ఆలోచించాలని కోరింది.

Ghajal Srinivas
Radio Jaki
Sexual Harrasment
Police
  • Loading...

More Telugu News