Manisha yadav: స్పెషల్ సాంగని చెప్పి ఐటమ్ గార్ల్ ను చేశారు: వెంకట్ ప్రభుపై మనీషా సంచలన ఆరోపణలు

  • కథను మలుపు తిప్పే సీన్లు, ఓ సాంగ్ ఉంటుందని చెప్పారు
  • కానీ 'స్వప్న సుందరి'గా చూపించారు
  • ఇప్పుడు అలాగే చూస్తున్నారంటున్న మనీషా

తనతో ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నామని చెప్పిన దర్శకుడు వెంకట్ ప్రభు, ఓ ఐటమ్ సాంగ్ చేయించి దారుణంగా మోసం చేశాడని నటి మనీషా యాదవ్ ఆరోపించింది. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన 'వళక్కు ఎన్ 18/9' చిత్రం ద్వారా పరిచయమైన మనీషా, ఆ మధ్య 'చెన్నై-28' సీక్వెల్ లో నటించింది. సినిమా విడుదలైన కొంతకాలం తరువాత ఆమె దర్శకుడిపై ఆరోపిస్తూ, ఓ పాట, సినిమాను మలుపు తిప్పే కీలక సన్నివేశాల్లో తానుంటానని చెప్పిన దర్శకుడు, తొలుత ఓ 'స్వప్న సుందరి' పాటను తీశాడని, అది స్పెషల్ సాంగ్ అని చెప్పాడని, ఆపై సినిమా రిలీజైన తరువాతే అది ఐటమ్ సాంగని తెలిసిందని, ఇప్పుడు తనను ప్రతి ఒక్కరూ 'స్వప్న సుందరి'గానే పిలుస్తున్నారని వాపోయింది. వెంకట్ అలా చేసుండాల్సింది కాదని, తాను ఐటమ్ గర్ల్ అని అనిపించుకోవడానికి ఇష్టపడటం లేదని అంది.

 కాగా, ఈ భామ దర్శకులపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. 'త్రిష ఇల్లన్నా నయనతార' చిత్రంలో తనతో కావాలనే అసభ్య సంభాషణలు పలికించి, ఓవర్ గ్లామర్ గా చూపించారని అధిక్ రవిచంద్రన్ పై మనీషా గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సంసార జీవితంలో ఉన్న ఈ సుందరి, గతంలో తనకు జరిగిన అన్యాయాలంటూ, ఇప్పుడు మీడియాకు ఎక్కడం వెనకున్న కథేంటో!

Manisha yadav
Item Song
Tamil Movie
Venkat Prabhu
  • Loading...

More Telugu News