Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి!

  • కేసీఆర్ ను బట్టలూడదీసి కొడతానన్నారు
  • ఇంతలోనే అంతగా నచ్చేశారా?
  • పెద్ద పని కోసమే కేసీఆర్ ను పవన్ కలిశారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీకాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కేవలం సినీ నటుడు మాత్రమేనని... రాజకీయాల పట్ల ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు. ఆయన దగ్గర సబ్జెక్టే లేదని చెప్పారు. ఏపీలో కూడా ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్లను తాను చూశానని... సందర్భం లేకుండా కుల ప్రస్తావన తీసుకొస్తారని, సందర్భం లేకుండా ఏదేదో మాట్లాడతారని, అప్పుడే ఆవేశపడతారని, అంతలోనే నవ్వుతారని ఎద్దేవా చేశారు.

గతంలో వరంగల్ సభలో ఇదే కేసీఆర్ ను బట్టలిప్పిచ్చి కొడతామంటూ పవన్ అన్నారని... దాంతో, కేసీఆర్ కు సానుభూతి వచ్చి, కొన్ని ఓట్లు కూడా పడ్డాయని అన్నారు. ఇంతలోనే ఆయనకు కేసీఆర్ అంతగా నచ్చేశారా? అని ప్రశ్నించారు. 'అజ్ఞాతవాసి' సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకే కేసీఆర్ తో పవన్ భేటీ అయ్యారని విమర్శించారు. ఏదో పెద్ద పని కోసమే కేసీఆర్ ను కలిశారని చెప్పారు.

తెలంగాణ పట్ల పవన్ ఓ పురుగులా తయారయ్యాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలో జరగనన్ని స్కామ్ లు తెలంగాణలో జరుగుతున్నాయని... ఈ విషయాల గురించి తెలుసుకోకుండానే నోటి కొచ్చినట్టు పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కల్పించుకోవద్దని పవన్ కు తాను వార్నింగ్ ఇస్తున్నానని చెప్పారు.

Pawan Kalyan
komati reddy venkata reddy
KCR
  • Loading...

More Telugu News