tweet: మొదటిసారి ట్వీట్‌లో గ్రామర్ తప్పిదం చేసిన శశి థరూర్
- టైపింగ్ తప్పిదమని వివరణ ఇచ్చిన కాంగ్రెస్ నేత
- ట్విట్టర్‌లో ఆంగ్లం బోధించే టీచరని థరూర్‌కి పేరు
- పెద్ద పెద్ద ఆంగ్లపదాలు వాడుతూ ట్వీట్లు చేసే శశి థరూర్
కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్విట్టర్ ఖాతా చూస్తే.. ఓ చిన్న సైజు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలా ఉంటుంది. కొత్త కొత్త పదాలు వాడుతూ ఆయన చేసే ట్వీట్ల కారణంగా ట్విట్టర్‌లో ఇంగ్లీషు టీచర్ అంటూ నెటిజన్లు ఆయనకు పేరు పెట్టారు. ఆయన ట్వీట్లను అర్థం చేసుకోవాలంటే డిక్షనరీ తెరవక తప్పదని వారు కామెంట్లు చేస్తుంటారు.
అలాంటి శశి థరూర్ ఇటీవల చేసిన ట్వీట్‌లో గ్రామర్ తప్పిదం చేశారు. దాన్ని గుర్తించిన ఓ నెటిజన్, థరూర్ ట్వీట్‌ను సరిచేస్తూ కామెంట్ పెట్టాడు. అయితే అది టైపింగ్ తప్పిదమని థరూర్ దానికి వివరణ ఇవ్వడం గమనార్హం. అయితే శశిథరూర్ తప్పిదాన్ని కనిపెట్టిన సుహేల్ సేథ్‌ను మాత్రం నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తారు. కొత్త సంవత్సరం పూట థరూర్ ట్వీట్‌లో తప్పిదం కనిపెట్టి చరిత్ర సృష్టించాడంటూ కామెంట్లు చేశారు.