two wheeler sales: ద్విచక్ర వాహనాల పరుగులు... డిసెంబర్ లో టాప్ గేర్ లో విక్రయాలు!

  • భారీ సంఖ్యలో విక్రయాలు నమోదు
  • సుజుకి వాహనాలకు డిమాండ్
  • 53 శాతం పెరిగిన అమ్మకాలు

ఆటోమొబైల్ కంపెనీలు గడిచిన డిసెంబర్ మాసంలో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలను విక్రయించాయి. ఏడాది చివరి నెల కావడంతో, ఆ సంవత్సరానికి సంబంధించిన మోడళ్లపై డిస్కౌంట్లు, ఉచిత ఇన్సూరెన్స్ తరహా ఆఫర్లు ఎక్కువ విక్రయాల నమోదుకు దోహదపడ్డాయి.

1. బజాజ్ ఆటో
6 శాతం అధికంగా విక్రయాలను నమోదు చేసింది. 1,12,930 వాహనాలను విక్రయించింది.
2. సుజుకి మోటార్ సైకిల్స్
సుజుకి మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు ఏకంగా 53 శాతం పెరిగాయి. 32,786 యూనిట్లను విక్రయించింది. కొత్తగా తీసుకొచ్చిన 150సీసీ ఇంట్రూడర్ కు మంచి డిమాండ్ ఉంది.
3. రాయల్ ఎన్ ఫీల్డ్
రాయల్ ఎన్ ఫీల్డ్ 65,367 మోటారు సైకిళ్లను విక్రయించింది. గతేడాది ఇదే మాసంతో పోలిస్తే విక్రయాలు 16 శాతం పెరిగినట్టు.
4. టీవీఎస్ మోటార్
జూపిటర్, అపాచే ఆర్ఆర్ 310 మోడళ్లు సక్సెస్ కావడంతో విక్రయాలు 35 శాతం పెరిగి 2,07,778 యూనిట్లుగా నమోదయ్యాయి.
5. హీరో మోటోకార్ప్
43 శాతం అధికంగా వాహనాలు అమ్మేసింది. 4,72,731 వాహనాలు అమ్ముడుపోయాయి.

  • Loading...

More Telugu News