Ghajal Srinivas: గజల్ శ్రీనివాస్ అకృత్యాలు ఎన్నెన్నో... మరిన్ని వీడియో ఆధారాలు వెలుగులోకి!

  • రేడియో జాకీని వేధించిన కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్
  • పోలీసులకు గంటల కొద్దీ నిడివి ఉన్న 20 వీడియోలు అందించిన బాధితురాలు
  • మరిన్ని వీడియోలు మీడియా వద్దకు

తన వద్ద పని చేస్తున్న రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయి, ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్ కు సంబంధించిన మరిన్ని వేధింపుల వీడియోలు వెలుగుచూశాయి. బాధితురాలు స్వయంగా గజల్ శ్రీనివాస్ అకృత్యాలను స్టింగ్ ఆపరేషన్ ద్వారా వీడియో తీసి బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెడ్ పై అభ్యంతరకర స్థితిలో శ్రీనివాస్ పడుకొని ఉండగా, ఆ ఫీసులో పనిచేసే పార్వతి అనే యువతి ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో చక్కర్లు కొడుతుండగా, తాజాగా మరో రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

బాధితురాలు మొత్తం 10 వీడియోలను పోలీసులకు అందించింది. వీటిల్లో కొన్ని పోలీసు వర్గాల ద్వారానే మీడియాకు చేరడం గమనార్హం. ఆలయవాణి కార్యాలయాన్ని బ్రోతల్ హౌస్ గా మార్చిన శ్రీనివాస్, పలువురు అమ్మాయిలను అక్కడకు తెచ్చుకున్నట్టు ఈ వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. గంటల కొద్దీ నిడివిగల వీడియోలను బాధితురాలు పోలీసులకు అందించగా, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, ఆయనపై మరిన్ని సెక్షన్లను జోడించే పనిలో ఉన్నారు. పరారీలో ఉన్న మరో పీఏను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Ghajal Srinivas
Sting Operation
Sexual Harrasment
  • Loading...

More Telugu News