Chandrababu: మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తాం: సీఎం చంద్రబాబు

  • ఏపీలో ఐదో విడత ‘జన్మభూమి - మా ఊరు’  
  • ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించిన చంద్రబాబు
  • పేదలకు ‘సంక్రాంతి కానుక’ ఇస్తున్నాం

ఏపీలో ఐదో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం ప్రకాశం జిల్లా దర్శిలో ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని చెప్పారు.

 పేదలు పండగ చేసుకోవాలని సంక్రాంతి కానుక ఇస్తున్నామని, ‘కాంగ్రెస్’ పార్టీ హయాంలో ‘దీపం’ పథకాన్ని ఆర్పేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, 57 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News