america: మెలానియా ట్రంప్ ఖరీదైన డ్రెస్ పై విమర్శల వర్షం!

  • న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేసిన యూఎస్ అధ్యక్షుడు ట్రంప్
  • ఖరీదైన గౌన్ లో పార్టీకి హాజరైన మెలానియా ట్రంప్
  • దాని ఖరీదు సుమారు నాలుగువేల యూఎస్ డాలర్లు!

న్యూ ఇయర్ వేడుకల్లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ధరించిన అతి ఖరీదైన డ్రెస్ పై విమర్శల వర్షం కురుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ఈ వేడుకకు ఆమె హాజరయ్యారు. పింక్ ఫ్లోరల్-ఎంబ్రాయిడరీ చేసిన అద్భుతమైన ఓ గౌన్ ను ధరించి ఈ పార్టీకి ఆమె హాజరయ్యారు. ఈ డ్రెస్ ఖరీదు సుమారు నాలుగు వేల అమెరికన్ డాలర్లు చేస్తుందట. ‘ఇంత ఖరీదైన డ్రెస్ ఆమె ధరిస్తారా?’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

  • Loading...

More Telugu News