web series: నన్ను అసభ్యంగా చిత్రీకరించి, పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేశారు: సినీ నటి

  • వెబ్ సిరీస్ లో అశ్లీలత
  • తనను అభ్యంతరకరంగా చిత్రీకరించారన్న నటి
  • దర్శకుడి కోసం పోలీసుల గాలింపు

వెబ్ సిరీస్ పేరుతో తనను అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరించారంటూ ఓ సినీ నటి  ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైకి చెందిన సినీ దర్శకుడు ఉపేంద్ర రాయ్, కాస్టింగ్ డైరెక్టర్ రాజన్ అగర్వాల్ లు తమ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రను ఇస్తామంటూ తనను మధ్ దీవులకు తీసుకెళ్లి, షూటింగ్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ఆ కంటెంట్ ను పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో, కేసు నమోదు చేసిన పోలీసులు రాజన్ అగర్వాల్ ను అరెస్ట్ చేశారు. దర్శకుడు ఉపేంద్ర రాయ్ కోసం గాలిస్తున్నారు.

web series
upendra roy
  • Loading...

More Telugu News