ram: రామ్ తదుపరి సినిమాకి హీరోయిన్ దొరికేసింది!

  • రామ్ తాజా చిత్రానికి సన్నాహాలు 
  • దర్శకుడిగా త్రినాథరావు నక్కిన 
  • నిర్మాతగా దిల్ రాజు    

తెలుగు తెరకి కొత్త కథానాయికల తాకిడి ఎక్కువైంది. ఈ మధ్య కాలంలో వచ్చిన కథానాయికలలో కొంతమంది చాలా తేలికగా అగ్రస్థానానికి చేరుకున్నారు. అయితే కొత్తగా వస్తోన్న కథానాయికలు కూడా చకచకా ఆ స్థానానికి చేరుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు. అలాంటివారిలో ఒకరిగా రష్మిక మందన కనిపిస్తోంది.

కన్నడలో 'కిర్రిక్ పార్టీ' హిట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సుందరి, తెలుగులో నాగశౌర్య  జోడీగా 'ఛలో' సినిమా చేస్తోంది. అంతేకాదు పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమా చేస్తోంది. తాజాగా రామ్ జోడీగా ఛాన్స్ కొట్టేసింది. రామ్ హీరోగా త్రినాథరావ్ నక్కిన, దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన రష్మిక మందనను తీసుకున్నాడు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.  

  • Loading...

More Telugu News