pradeep: తాగొద్ద‌ని నీతి వాక్యాలు చెప్పాడు.. తనే తాగేసి దొరికిపోయాడు... తెర‌పైకి ప్ర‌దీప్ పాత‌ వీడియో!

  • మ‌ద్యం తాగి డ్రైవ్ చేయొద్ద‌ని గ‌తంలో చెప్పిన ప్ర‌దీప్‌
  • వీడియో ప్లే చేస్తూ మోత మోగిస్తున్న వార్తా ఛాన‌ళ్లు
  • ఇవాళ బేగంపేట‌లో కౌన్సిలింగ్‌

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా మ‌ద్యం తాగి, బ్రీత్ అన‌లైజ‌ర్ టెస్టులో దొరికిపోయిన ప్రదీప్‌కు సంబంధించి ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోలో మ‌ద్యం తాగి డ్రైవ్ చేయొద్ద‌ని ప్ర‌దీప్ నీతి వాక్యాలు చెబుతుండ‌టం విశేషం. ఇలా నీతి వాక్యాలు చెప్పిన వాడే.. ఇవాళ త‌ప్పతాగి దొరికిపోయాడంటూ వార్తా ఛాన‌ళ్లు ప్ర‌దీప్‌ను తూర్పారపడుతున్నాయి.

ఈ నీతిబోధ‌న‌ల వీడియోను, ప్ర‌దీప్ ప‌ట్టుబ‌డిన వీడియోను ప‌క్క‌ప‌క్క‌నే ప్లే చేస్తూ మోత మోగిస్తున్నాయి. ఒక్క పిచ్చి ప‌నితో ప్ర‌దీప్ ప‌రువు పోగొట్టుకున్నాడ‌ని వ్యాఖ్యానిస్తున్నాయి.  కాగా, ప్ర‌దీప్‌కి క‌చ్చితంగా రెండు నుంచి వారం రోజుల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది

  • Loading...

More Telugu News