Chandrababu: తెలుగు ప్రజలతో పాటు నాక్కూడా చంద్రబాబు ఇచ్చిన కానుకగా భావిస్తాను: వెంకయ్యనాయుడు

  • 2018ని తెలుగు భాషా పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించడంపై హర్షం
  • పాలకులు పోషించనిదే మన మాటకు, అక్షరానికి గౌరవం రాదు
  • నేటి తరం సినిమాలపై వెంకయ్యనాయుడు సునిశిత విమర్శ

2018ని తెలుగు భాషా పరిరక్షణ సంవత్సరంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. 29వ విజయవాడ పుస్తక మహోత్సవంను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త ఏడాదిని తెలుగు భాషా పరిరక్షణ సంవత్సరంగా చంద్రబాబు ప్రకటించడాన్ని తెలుగు ప్రజలతో పాటు తనకు కూడా ఆయన ఇచ్చిన కానుకగా భావిస్తానని సంతోషం వ్యక్తం చేశారు.

పాలకులు పోషించనిదే మన మాటకు, అక్షరానికి గౌరవం రాదని, అందుకే, గతంలో కవులను, పండితులను మహారాజులు పోషిస్తుండేవారని అన్నారు. ఈ సందర్భంగా సాహిత్యం, సంగీతం, కవిత్వం, సినిమాల గురించి ఆయన ప్రస్తావించారు. నేటి తరం సినిమాలపై ఆయన సునిశిత విమర్శలు చేశారు. సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కానీ సినిమాల్లో నాణ్యత కనిపించడం లేదని, సంస్కృతీసంప్రదాయలను కాపాడేలా ‘సినిమా’ ఉండాలని సూచించారు. ఆనాటి సినిమాల్లో అసభ్యత లేకుండా అద్భుతంగా శృంగారం ఉండేదని అన్నారు. 

  • Loading...

More Telugu News