apple: గతేడాది ఎక్కువ లాభాలు పొందిన మొబైల్ తయారీ సంస్థ... ఆపిల్
- 60 శాతం అమ్మకాలు ఆపిల్‌వే
- రెండోస్థానంలో శాంసంగ్
- పుంజుకున్న చైనా కంపెనీలు
గతేడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో అత్యధిక లాభాలు గడించిన సంస్థగా ఆపిల్ నిలిచింది. ప్రముఖ రీసెర్చ్ కంపెనీ కౌంటర్ పాయింట్ విడుదల చేసిన జాబితా ప్రకారం దాదాపు 60 శాతం షేరును ఆక్రమించి ఆపిల్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. ఇక తర్వాతి స్థానాల్లో వరుసగా హువావే, ఒప్పో, వివో, షియోమీ కంపెనీలు ఉన్నాయి.
గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆపిల్‌కు ఉన్న లాభాలు 86 శాతం నుంచి 60 శాతానికి తగ్గిపోయాయి. ఒక్కో ఐఫోన్ విక్రయంతో ఆపిల్ 150 డాలర్ల లాభాన్ని ఆర్జించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. పేరుగాంచిన సంస్థలతో పాటు హువావే, ఒప్పో, వివో, షియోమీలు కూడా లాభాలను ఆర్జించినట్లు కౌంటర్ పాయింట్ వెల్లడించింది.