ramgopal varma: అలా జరుగుతుందని నమ్మే వాళ్లందరికీ ‘ఐ విష్ ఏ వెరీ అన్ హ్యాపీ న్యూ ఇయర్’: రామ్ గోపాల్ వర్మ

  • విషెస్ చెబితే ఒకరి జీవితం సంతోషమయమవుతుందా?
  • అలా జరుగుతుందని నమ్మే మొద్దులకు ‘ఐ విష్ ఏ వెరీ అన్ హ్యాపీ న్యూ ఇయర్’
  • ఉచితంగా చెప్పొచ్చుగా, అందుకే, శుభాకాంక్షలు చెబుతారు: వర్మ

‘గుడ్ మార్నింగ్’ చెప్పడం అనవసరమని, ఐదు నిమిషాలు వేస్ట్ చేసుకోవడమని చెప్పే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘న్యూ ఇయర్  శుభాకాంక్షలు చెప్పేవారిని కూడా విడవలేదు. తాజాగా   ఫేస్ బుక్ పోస్ట్ లో తన మార్క్ వ్యాఖ్యలు చేశారు.‘‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చెప్పడం ద్వారా ఒక వ్యక్తి జీవితం సంతోషమయం అవుతుందని నమ్మే మొద్దులకు ‘ఐ విష్ ఏ వెరీ అన్ హ్యాపీ న్యూ ఇయర్’. ఇతరుల సంతోషం, శ్రేయస్సు గురించి ప్రజలు నిజంగా ఆలోచించే వారే అయితే, వారు తమ డబ్బును, తమ విలువైన వస్తువులను దానం చేసేయాలి. కానీ, ఎవరూ ఆ పని చేయరు, శుభాకాంక్షలు మాత్రం చెబుతారు..ఎందుకంటే, వాటిని ఉచితంగా చెప్పొచ్చుగా’ అని వర్మ విమర్శించారు.

ramgopal varma
new year
  • Loading...

More Telugu News