anushka: 'భాగమతి' నుంచి అదిరిపోయే న్యూ పోస్టర్ రిలీజ్

  • 'భాగమతి'గా పలకరించనున్న అనుష్క 
  • న్యూ ఇయర్ కానుకగా కొత్త పోస్టర్ 
  • విభిన్నమైన వేషధారణలో అనుష్క

అనుష్క ప్రధానమైన పాత్రగా 'భాగమతి' చిత్రం తెరకెక్కింది. అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఈ మధ్య విడుదలైన ఫస్టు పోస్టర్ కు .. ఫస్టు టీజర్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

పాడుబడిన ఓ బంగ్లాలో అనుష్క తిరుగాడుతూ .. గోడపై గల ఒక పురాతన చిత్రాన్ని చూస్తున్నట్టుగా వుంది. చిత్రమైన వేషధారణలో కనిపిస్తూ అనుష్క ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఓ 'అరుంధతి' .. ఓ 'రుద్రమదేవి' మాదిరిగా ఈ సినిమా కూడా అనుష్క కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అంటున్నారు.  

  • Loading...

More Telugu News