new year: న్యూఇయ‌ర్ మెసేజ్‌ల కార‌ణంగా కొన్ని దేశాల్లో మొరాయించిన వాట్సాప్‌

  • ఫిర్యాదుల‌తో నిండిపోయిన ట్విట్ట‌ర్‌
  • లాగిన్‌, క‌నెక్ష‌న్‌లో స‌మ‌స్య‌లు
  • స్పందించ‌ని వాట్సాప్‌

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పంపుకునే మెసేజ్‌ల కార‌ణంగా ప్ర‌ముఖ స‌మాచార స‌ర‌ఫ‌రా యాప్ వాట్సాప్ కొన్ని దేశాల్లో మొరాయించింది. ప్ర‌ముఖ వెబ్‌సైట్ డౌన్ డిటెక్ట‌ర్ క‌థ‌నం ప్ర‌కారం.. యూకే, యూర‌ప్‌, బ్రెజిల్ ప్రాంతాల్లోని వాట్సాప్ వినియోగ‌దారులు లాగిన్, క‌నెక్ష‌న్‌లలో స‌మ‌స్య వ‌చ్చింద‌ని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వాట్సాప్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో చాలా మంది వినియోగ‌దారులు ట్విట్ట‌ర్‌ను ఆశ్ర‌యించారు.

తమ స‌మ‌స్య‌ను ట్వీట్ చేస్తూ  #WhatsAppDown అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేశారు. ట్వీట్లు చేసిన వారిలో 54 శాతం మందికి క‌నెక్టింగ్ స‌మ‌స్య‌, 27 శాతం మందికి మెసేజ్ పంప‌డంలో స‌మ‌స్య‌, 17 శాతం మందికి లాగిన్ సమ‌స్య‌లు త‌లెత్తిన‌ట్లు డౌన్ డిటెక్ట‌ర్ పేర్కొంది. అయితే ఈ స‌మ‌స్య‌పై వాట్సాప్ అధికారికంగా స్పందించ‌లేదు.

  • Loading...

More Telugu News